నెట్‌ఫ్లిక్స్, ఆహా మధ్య అంతర్యుద్ధం.. మాటకు మాట

ఏ బిజినెస్‌లోనైనా, ఏ రంగంలోనైనా కాంపిటీషన్ అనేది సర్వసాధారణం. ఇక బిజినెస్‌లో అయితే కాంపిటీషన్ మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక ప్రొడక్ట్‌కు పోటీగా మరో ప్రొడక్ట్ వస్తూ ఉంటుంది. దీంతో ఒక సంస్థకు, మరో సంస్థకు మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి. తమకు పోటీగా ఉన్న బ్రాండ్‌ను దెబ్బతీసేందుకు మిగతా సంస్థలు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లు నెట్‌ఫిక్స్, ఆహా మధ్య అదే జరుగుతోంది.

netflix and aha saiters

నెట్‌ఫిక్స్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఆహా మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. ఆహా అనేది పూర్తిగా తెలుగు కంటెంట్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. అందుకే తెలుగు ప్రేక్షకులందరికీ బాగా సుపరిచితమైంది. దీంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కన్ను ఆహాపై పడింది.

తొలిసారిగా నెట్‌ఫ్లిక్స్ తెలుగు ఆంథాలజీ సిరీస్ పేరిట పిట్ట కథలు అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించింది. తెలుగు దర్శకులైన నాగ్ అశ్విన్, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి ఈ వెబ్ సిరీస్‌కు పనిచేయగా.. , శ్రుతిహాస‌న్‌, అమ‌లాపాల్, ఈషా రెబ్బా, ల‌క్ష్మీ మంచు కీలక పాత్రలలో నటించారు. దీని టీజర్ తాజాగా విడుదల అవ్వగా.. ఈ సందర్భంగా ‘ఒకవేళ మీకు తెలుగులో బ్రష్ అప్ చేయడానికి ఒక కారణం అవసరమైతే ‘నెట్ ఫ్లిక్స్ ఒరిజినల్ త్వరలో మీ ముందుకు’ వస్తుంది అంటూ పరోక్షంగా ఆహాకు కౌంటర్ ఇస్తూ నెట్‌ఫ్లిక్స్ ట్వీట్ ేసింది.

ఈ ట్వీట్‌కు ఆహా రీకౌంటర్ ఇచ్చింది. ‘మనది ఎలాగూ 100% తెలుగు నే కదా.. ఇక బ్రషింగ్ లు అవసరం లేదు’.’మా దగ్గర ఎన్నో ఒరిజినల్స్ ఉన్నాయి. అరుస్తున్నామా?’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌కి కౌంటర్ ఇచ్చింది.