‘వెయింటింగ్ ఓవర్… ‘ మోక్షజ్ఞ ఎక్కడ?

నందమూరి నటసింహం నందమూరి బాల కృష్ణ గురించి తెలుగు వారికి దిలిసిందే. నందమూరి తారక రామారావు గారి వారసుడుగా సినీరంగ ప్రవేశం చేసినప్పటికీ ఆయనకంటూ ఒక ప్రత్యేక స్తన్నాం సంపాదించుకుని అభిమానుల చేత నటసింహం అనే పిలుపును పొందారు. అయితే ఆయన కుమారుడే ఈ నందమూరి మోక్షజ్ఞ. ఇప్పటికే మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం చేస్తాడని బాలకృష్ణ పలుమార్లు వెల్లడించిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం మోక్షజ్ఞ వైజాగ్ లోని ఓ పేరుగాంచిన మాస్టర్ దగ్గర నటనకు సంబందించిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఇది ఇలా ఉండగా మోక్షజ్ఞ మేక్ ఓవర్ ఫోటోను నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ‘యువసింహం’ అంటూ మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే మోక్షజ్ఞ రాక ఎప్పుడు ఏ నిర్మాణ సంస్థ ద్వారా ఎలా ఉండబోతుంది అనేది స్వయంగా బాలకృష్ణ చెప్పాల్సిందే. అయితే సెప్టెంబర్ 6న మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయంపై అప్డేట్ వచ్చే అవకాశం ఉందని నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్నారు.