సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్, వరుణ్ తేజ్ VT13 తెలుగు-హిందీ యాక్షన్ డ్రామాలో మానుషి చిల్లర్‌

కొన్ని నెలల క్రితం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా ఓ బిగ్గెస్ట్ మూవీని అనౌన్స్ చేసింది సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్. యథార్థ సంఘటనల ప్రేరణ రూపొందుతున్న యాక్షన్ డ్రామా ఇది.

వరుణ్ తేజ్ పాత్రను భారతీయ వైమానిక దళ పైలట్‌గా మేకర్స్ ఒక ఆసక్తికరమైన వీడియోతో పరిచయం చేసినప్పుడు ఈ తెలుగు-హిందీ యాక్షన్ డ్రామా సినీ ప్రేక్షకులలో క్యురియాసిటీని క్రియేట్ చేసింది. సినిమాపై అంచనాలని మరింత పైకి తీసుకువెళుతూ..సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఇప్పుడు మరో ప్రత్యేకమైన అనౌన్స్ మెంట్ వీడియోతో మానుషి చిల్లర్‌ ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలియజేసింది.

మానుషి చిల్లర్ (మిస్ యూనివర్స్ 2017, సామ్రాట్ పృథ్వీరాజ్) ఇందులో రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. పాత్ర గురించి మానుషి మాట్లాడుతూ, “యాక్షన్‌తో నిండిన ఈ అద్భుతమైన సినిమా భాగమైనందుకు, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్‌తో కలిసి పని చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నాపై నమ్మకం వుంచిన దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడాకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వరుణ్ తేజ్‌తో స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎక్సయిటింగా వుంది’’ అన్నారు

ఇంకా టైటిల్ ఖరారు కాని చిత్రం దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్. యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా వైమానిక దళం ఎదుర్కొనే సవాళ్లను చూపనుంది.

అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్, VFX లోదిట్ట అయిన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రం ఈరోజు సెట్స్‌పైకి వెళ్లి తెలుగు, హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడుతుంది.

VT13ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నాను. ఈ చిత్రానికి నందకుమార్ అబ్బినేని సహ నిర్మాత.