పూజా కార్యక్రమాలతో “వృశ్చికం” చిత్ర లాంచ్

మంగపుత్ర, యశ్విక జంటగా నటిస్తున్న సినిమా “వృశ్చికం”. ఈ చిత్రాన్ని శ్రీ ఆద్య నిర్మాణం బ్యానర్ పై శివరామ్ నిర్మిస్తున్నారు. మంగపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ ఫిలింనగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో “వృశ్చికం” సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పాల్గొని గౌరవ దర్శకత్వం వహించారు. నటులు కోసూరి సుబ్రహ్మణ్యం కెమెరా స్విచ్ఛాన్ చేయగా, సుప్రీంకోర్టు అడ్వకేట్ హబీబ్ సుల్తానా క్లాప్ ఇచ్చారు

హీరో, దర్శకుడు మంగపుత్ర మాట్లాడుతూ – నేను 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నటుడిగా పవన్ కల్యాణ్ గారి జల్సా, గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ మూవీస్ తో పాటు బాహుబలి 1, 2 చిత్రాల్లో నటించాను. రాజమౌళి గారిని చూసి ఆయన దర్శకత్వానికి ఏకలవ్య శిష్యుడిగా మారాను. వృశ్చికం మూవీతో హీరోగా నటిస్తూ దర్శకుడిగా మారుతున్నాను. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంటుంది. 3 షెడ్యూల్స్ లో 45 రోజుల్లో సినిమాను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నా. రామచంద్రాపురం, భద్రాచలం, హైదరాబాద్ లో షెడ్యూల్స్ చేస్తాం. ఈ సినిమాను మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మీ ముందుకు తీసుకొస్తాం. మా చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాం. అన్నారు.

హీరోయిన్ యశ్విక మాట్లాడుతూ – వృశ్చికం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈరోజు మా మూవీ ఓపెనింగ్ కు వచ్చి బ్లెస్ చేసిన పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ గారికి ఇతర గెస్ట్ లకు థ్యాంక్స్. అన్నారు.

నటుడు కోసూరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ – వృశ్చికం సినిమాలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాను. ఈ సినిమా ప్రారంభోత్సవానికి కెమెరా స్విచ్ఛాన్ చేయడం సంతోషంగా ఉంది. చిన్న చిత్రానికి మీ అందరి సపోర్ట్ కావాలి. మీడియా మిత్రులు మా వృశ్చికం మూవీని ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. అన్నారు.

సంగీత దర్శకుడు ప్రమోద్ మాట్లాడుతూ – వృశ్చికం సినిమాకు మ్యూజిక్ చేసే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో మూడు పాటలు ఉంటాయి. సాంగ్స్ తక్కువే అయినా బీజీఎం కు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. మంచి పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. కొత్త తరహా కంటెంట్ తో వృశ్చికం సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

యాక్ట్రెస్ క్రాంతి బలివాడ మాట్లాడుతూ – వృశ్చికం సినిమా టైటిల్ చూస్తేనే ఎంతో ఆసక్తికరంగా అనిపిస్తోంది. నేను నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాను. ఈ టీమ్ లోని వారితో కూడా పనిచేశాను. మళ్లీ మేమంతా కలిసి ఈ సినిమాకు వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ సముద్రాల రవిచంద్ర మాట్లాడుతూ – వృశ్చికం సినిమా ఒక అద్భుతమైన కథతో మా డైరెక్టర్ మంగపుత్ర రూపొందిస్తున్నారు. టెక్నీషియన్స్ గా మేము ఈ మూవీని వీలైనంత క్వాలిటీతో మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ రోజు మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలు అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాం. అన్నారు.

నటీనటులు – మంగపుత్ర, యశ్విక, క్రాంతి బలివాడ, కోర్టు శ్రీనివాస్, మంజు ఆర్య, రవి, కోసూరి సుబ్రహ్మణ్యం, తదితరులు

టెక్నికల్ టీమ్

ఆర్ట్ – సముద్రాల రవిచంద్ర
మేకప్ – రఘు
కాస్ట్యూమ్స్ – తిరుమల
మ్యూజిక్ – ప్రమోద్
డీవోపీ – రాజ్ కె దిలీప్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – రమణ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఇ. శ్రీరామ్ గౌడ్
కో ప్రొడ్యూసర్ – తాండ్ర గోపాల్
సమర్పణ – గంగాధర్ రెడ్డి
పీఆర్ ఓ- వీరబాబు
ప్రొడ్యూసర్ – శివరామ్
రచన దర్శకత్వం – మంగపుత్ర