AP: ఓట‌ర్ గుర్తింపు కార్డులో విక్ట‌రి వెంక‌టేశ్‌.. క‌లెక్ట‌ర్ ఆగ్రహాం..

AP: ఏపీలో ప్ర‌స్తుతం పంచాయ‌తీ ఎన్నిక‌ల హ‌డావుడిలో ఉన్నారు. ఇప్ప‌టికే మూడో ద‌శ పోలింగ్ ముగిసింది. చివ‌రి విడ‌త పోలింగ్‌కు అధికారులు స‌న్న‌ద్ధం అవుతున్నారు. మ‌రోవైపు జోరుగా అభ్య‌ర్థులు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా క‌ల్లూరు ప‌రిధిలో ఓట‌రు జాబితాలో సినీ న‌టుడు విక్ట‌రి వెంక‌టేశ్ ఉన్న ఫోటో హ‌ల్‌చ‌ల్ చేసింది. దీంతో ఆ విష‌యంపై APక‌ర్నూల్ జిల్లా క‌లెక్ట‌ర్ వీర‌పాండియ‌న్ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేశారు.

వెంట‌నే విచార‌ణ జ‌రిపి నివేదిక ఇవ్వాల‌ని క‌ర్నూల్ ఆర్డీవో, క‌ల్లూరు త‌హ‌సీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంబంధిత వార్డు ఓట‌ర్ లిస్టు ఇన్‌ఛార్జ్‌, బీఎల్ఏపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారులను ఆదేశించారు. ఇలాంటివి గ‌తంలో చాలా చోట్ల జ‌రిగాయి.. గ‌తేడాది టాలీవుడ్ మ‌హేశ్‌బాబు కూడా హల్‌చ‌ల్ చేశాడు. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి APజ‌గ‌న‌న్న విద్యాదీవెన కార్డుపై విద్యార్థిని ఫోటో బ‌దులు మ‌హేశ్‌బాబు ఫోటో ఉండ‌డం క‌ల‌క‌లం రేపింది.