‘వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెంబర్ 1 ప్రారంభం…

ఆదిత్య ఓం, దిషా హీరో హీరోయిన్లు గా వి.కె.బి ఆర్ట్స్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమా శుక్రవారం (ఆగస్ట్ 9న) ఫిలిం నగర్ సాయిబాబా టెంపుల్ లో ఉదయం 9:45 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.

రాధా మోహన్, దామోదర్ ప్రసాద్, శ్రీరంగం సతీష్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ప్రదీప్ రావత్, షియాజి షిండే, ఆశిష్ విద్యార్థి మొదలగు నటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. పి.యుగంధర్ రామ్ ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. వి.కుమార్ బాబు నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రానికి జే. తులసీ దాస్ సహా నిర్మాత.


*సాంకేతిక నిపుణులు*
కథ – మాటలు- దర్శకత్వం: పి.యుగంధర్ రామ్నిర్మాత:వి.కుమార్ బాబుసహా నిర్మాత: జే. తులసి దాస్కెమెరా: నగేష్మ్యూజిక్: జయ సూర్యడాన్స్ మాస్టర్: కపిల్ఫైట్స్: వజ్రాలు, పృద్వి శేఖర్ఎడిటర్: రాజుఆర్ట్ డైరెక్టర్: విజయ కృష్ణపి.ఆర్.ఓ: మధు వి.ఆర్