Tollywood: వైవా హ‌ర్ష‌కు యాక్సిడెంట్ అయిందా?.. హ‌స్పిట‌ల్‌లో ఉన్న ఫోటో వైర‌ల్‌!

Tollywood: వైవా హ‌ర్ష అంటేనే వైవా క్వ‌శ్చ‌న్స్ వేసే వీడియో ద్వారా యూట్యూబ్ నుంచి సినిమా స్థాయిలో ఎదిగిన వ్య‌క్తి. యూట్యూబ్ నుంచి మెల్ల‌మెల్ల‌గా వెండితెర‌పై కామెడీ కామెడీ క్యారెక్ట‌ర్స్ చేసే స్థాయికి వ‌చ్చాడు Tollywoodవైవా హ‌ర్ష‌. ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్‌గా మారిపోయాడు. ఇక ఇటీవ‌లే హ‌ర్ష ఎంగేజ్‌మెంట్ ఘ‌నంగా జ‌రిగింది. పెళ్లి విష‌యానికొస్తే.. స‌మ్మ‌ర్‌లో పెళ్లి జ‌రుగుతుందని స‌మాచారం. కాగా తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా వైవా హ‌ర్ష ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ఫోటో చూసి నెటిజ‌న్లంద‌రూ షాక్ అవుతున్నారు.

viva harsha

ఇంత‌కీ షాక్‌కు గురిచేసిన ఆ ఫోటో ఏంటి అనుకుంటున్నారా.. హ‌ర్ష హాస్పిట‌ల్‌లో బెడ్‌పై పెద్ద పెద్ద గాయాల‌తో క‌నిపించాడు. Tollywoodదీంతో ఆ ఫోటోను చూసిన‌వారంతా హ‌ర్ష‌కు ఏమై ఉంటుంద‌ని షాక్ అయ్యారు. అయితే.. ఆ ఫోటోకు ఓ క్యాప్ష‌న్ పెట్టాడు.. దాన్ని చూసి ఆశ్చ‌ర్య‌పోయారు. టాలీవుడ్ న‌టుడు సుమంత్ హీరోగా తెర‌కెక్కుతున్న అన‌గ‌న‌గా ఓ రౌడీ చిత్రంలో వైవా హ‌ర్ష ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. Tollywoodఆ మూవీలో సీన్ కోసం హాస్పిట‌ల్ లో అడ్మిట్ అయ్యాడు. ఈ సినిమాలో భాగంగా హ‌ర్ష‌కు యాక్సిడెంట్ అవుతుంది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న హాస్పిట‌ల్ బెడ్‌పై ఉన్న ఫోటోను తీసుకొని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.