సినిమా విడుదలకు ముందే చంపేస్తారా? – విశ్వక్ సేన్

విశ్వక్ సేన్ కథానాయకుడిగా సాహో గారపాటి నిర్మాతగా వ్యవహరిస్తూ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం లైలా. తొలిసారి విశ్వక్ సేన్ లేడీ గెటప్ లో కనిపిస్తూ ఒక కొత్త ప్రయత్నం చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గారు, దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా వచ్చి ప్రమోట్ చేయడం జరిగింది. ఇంతవరకు సజావుగానే సాగింది. కానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నటుడు విశ్వక్ సేన్, నిర్మాత సాహూ అక్కడ లేని సమయంలో ఆ స్టేజ్ పై నటుడు 30 ఇయర్స్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ 150 గొర్రెలు కాస్త 11 గొర్రెలు అయిపోయాయి అంటూ మాట్లాడడం జరిగింది.

అయితే దానికి రియాక్ట్ అవుతూ కొంతమంది సోషల్ మీడియా వేదికగా బాయ్ కాట్ లైలా అనే హాష్ తో 25 వేల ట్విట్స్ వేయడం జరిగింది. అంతేకాక ఈ చిత్రం విడుదల అయిన రోజునే చిత్రపరిచి విడుదల చేస్తామని అన్నారు. కాగా ఈ సంఘటనపై స్పందిస్తూ నటుడు విశ్వక్ సేన్, నిర్మాత సాహూ లైలా చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీరాజ్ మాట్లాడిన మాటలకు, వారి సినిమాకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వారు ఈ చిత్రం కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఎంతో ఖర్చుపెట్టినట్లు తెలుపుతూ ఎవరో ఒకరు మాట్లాడిన మాటలకు సినిమా మొత్తాన్ని బాయికాట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు అంటూ వారు తెలియజేయడం జరిగింది. అంతేకాక ఒకవేళ ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ అంటూ వారి ఆవేదన తెలియజేశారు. సినిమా విడుదలకు ముందే చంపేస్తారా అంటూ విశ్వక్ సేన్ ప్రశ్నించారు. దయచేసి సినిమాపై ఎటువంటి దుష్ప్రచారం చేయొద్దని వేడుకున్నారు. అలాగే పృథ్వీరాజ్ పై చర్యలు తీసుకునే అవకాశం ఉందా అని మీడియా వారు ప్రశ్నించగా విశ్వక్ సేన్ అది అంతా మేము ఆలోచించలేదని, ప్రస్తుతానికి మా సినిమా ప్రమోషన్ చేసుకునే పనిలో ఉన్నామని అన్నారు.