నేచురల్ స్టార్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై `ఫలక్‌నుమాదాస్` వంటి సక్సెస్ఫుల్ మూవీతో హీరోగా తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `హిట్`. `ది ఫస్ట్ కేస్` ట్యాగ్ లైన్. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి త్రిపిర్నేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ హీరోయిన్గా నటిస్తోంది.
విశ్వక్ సేన్ ఈ చిత్రంలో విక్రమ్ రుద్రరాజు అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
“ఒకసారి ఇలాంటి ఇన్సిడెంటే ఈ నీలైఫ్‌లో జరిగినప్పుడు యు లాస్ట్ సమ్ వన్ యు లవ్డ్. ఇప్పుడు మళ్లీ అలాంటి సిచ్యువేషనే వచ్చింది. వాట్ యు వాంట్ టు డు అబౌట్ ఇట్“
అనే డైలాగ్‌తో ఓ సీరియస్ ఇష్యూ వల్ల ఐపీయస్ ఆఫీసర్ ఎలాంటి సమస్యలో ఉన్నాడా? అని గ్లింప్స్‌తో ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే పోలీస్ ఆఫీసర్ అయిన విశ్వక్సేన్ ఎవరినో వెతుక్కుంటూ ఓ ఇంట్లోకి వెళ్లే సన్నివేశాన్ని ఈ గ్లింప్స్‌లో చూడొచ్చు. వివేక్ సాగర్ సంగీతం.. మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ జరుగుతుంది. సినిమాను ఫిబ్రవరి 28న విడుదల చేస్తున్నారు.