హిందీలో ‘హిట్’ మూవీ.. హీరో ఎవరంటే?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ యువ హీరోలు తెలుగు సినిమాలపై కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే కథ నచ్చితే వెంటనే హిందీలో రీమేక్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఇటీవల మరో యువ హీరో రాజ్ కుమార్ రావ్ కూడా తెలుగులో సూపర్ హిట్ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు.

తెలుగులో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా రూపొందిన విశ్వక్ సేన్ ‘హిట్’ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ హిట్ సినిమాను హీరో నాని నిర్మించాడు. అయితే ఇప్పుడు హిందీలో రాజ్ కుమార్ తో దిల్ రాజు నిర్మించబోతున్నారు.

సినిమాలో మెయిన్ పాయింట్ మిస్ అవ్వకుండా కొద్దిపాటి మార్పులతో ఒరిజినల్ దర్శకుడు శైలేషే హిందీలో కూడా హిట్ కథను డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా అక్కడ ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.