విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు ద‌ర్శ‌క‌త్వంలో RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్  నిర్మిస్తున్న చిత్రం `మట్టి కుస్తీ`

మాస్ మహారాజా రవితేజ స‌మ‌ర్ప‌ణ‌లో హీరో విష్ణు విశాల్ న‌టించిన చిత్రం ఎఫ్‌ఐఆర్‌ క‌మ‌ర్షియ‌ల్ హిట్ సంపాదించుకుంది. విమర్శకుల ప్రశంసలను గెలుచుకున్న ఈ చిత్రం త‌ర్వాత రవితేజ, విష్ణు విశాల్ కలిసి RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై దర్శకుడు చెల్లా అయ్యావుతో కలిసి రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రం టైటిల్‌ను మట్టి కుస్తి అని మేక‌ర్స్ నేడు ప్రకటించారు. పోస్టర్‌లో ప్రేక్షకులతో నిండిన ఆట స్థలం కనిపిస్తుంది. టైటిల్ సూచించినట్లుగా, మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొంద‌నుంది.

విష్ణు విశాల్ విభిన్నమైన కాన్సెప్ట్‌తో అంతే భిన్న‌మైన న‌ట‌న‌తో చిత్రాలు చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన ఓ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.

ఈ చిత్రానికి సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్ ప్రసన్న జికె.

కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్న‌ద‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు.

తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: చెల్లా అయ్యావు
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
బ్యానర్లు: RT టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
DOP: రిచర్డ్ M నాథన్
సంగీత దర్శకుడు: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: ప్రసన్న జికె
ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్
సాహిత్యం: వివేక్
PRO: వంశీ-శేఖర్