Nagarjuna: అన్న‌పూర్ణ‌ బ్యాన‌ర్‌లో మెగా వార‌సుడు.. నాగార్జున క్లారిటీ!

Nagarjuna: అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ఎన్నో మంచి చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టిగా నిలిచింది. కొత్త వారిని ఎంక‌రేజ్ చేస్తూ ప‌లు సినిమాల‌ను తెర‌కెక్కించి మంచి విజ‌యాల‌ను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు ఆ సంస్థ నుంచి ఓ వార్తా ఫిలింన‌గ‌ర్‌లో చ‌క్క‌ర్లు కొడుతుంది.. ఉప్పెన చిత్రంతో డెబ్యూ హీరోగా టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న మెగా హీరో వైష్ణ‌వ్‌తేజ్‌తో అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో ఓ సినిమాను నిర్మించ‌నున్నార‌ని వార్తాలు వెలువ‌డుతున్నాయి.

Nag with vishnav

ఈ విష‌యంపై నాగార్జున ఇటీవ‌లే స్పందించారు.. తాను న‌టించిన వైల్డ్‌డాగ్ చిత్ర ప్ర‌మోష‌న్స్ భాగంగా.. వైష్ణ‌వ్‌తేజ్‌తో సినిమా చేస్తున్నారా అని అడిగిన‌ప్పుడు.. దీనికి నాగ్ స‌మాధానం.. అవును.. నేను వైష్ణ‌వ్‌తేజ్‌తో ఓ సినిమా చేస్తున్నాను.. ఇప్ప‌టికే ఈ సినిమా కోసం కొత్త ద‌ర్శ‌కుడిని తీసుకున్నాం. వైష్ణ‌వ్ కూడా స్క్రిప్ట్ బాగా న‌చ్చింది అధికారికంగా త్వ‌ర‌లోనే మ‌రిన్ని విష‌యాల‌ను వెల్ల‌డిస్తామ‌ని క్లారిటీ ఇచ్చారు.‌