Uppena: విజ‌య్ సేతుప‌తి సినీ కార్మికులంద‌రికీ త‌ల 1000రూ చొప్పున ఇచ్చాడు: వైష్ణ‌వ్

Uppena: మెగా కాంపౌండ్ నుంచి వ‌స్తున్న‌ పంజా వైష్ణ‌వ్ తేజ్ హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం ఉప్పెన. ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన స‌హాయ ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇందులో వైష్ణ‌వ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా టాలీవుండ్ ఎంట్రీ ఇస్తుంది. అలాగే ఈ చిత్రంలో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి వైవిధ్య‌మైన విల‌న్‌పాత్ర‌ను పోషించాడు. Uppena ఈ సినిమాను సుకుమార్ రైటింగ్‌, మైత్రీమూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ ఏర్నేని, వై. ర‌విశంక‌ర్ నిర్మిస్తుండ‌గా.. ఈ నెల ఫిబ్ర‌వ‌రి 12న గ్రాండ్‌గా Uppena రిలీజ్ కాబోతుంది.

uppena

అయితే ఈ సినిమాలో విల‌న్‌గా చేసిన విజ‌య్ సేతుప‌తి గురించి ఓ ఆస‌క్తికర విష‌యాన్ని వెల్లడించాడు వైష్ణ‌వ్‌.. Uppena ఉప్పెన చిత్ర ప్ర‌మోష‌న్స్ భాగంగా.. ఉప్పెన హీరో వైష్ణ‌వ్ తేజ్.. విజ‌య్‌సేతుప‌తి గురించి తెలుపుతూ.. ఆయ‌న ఎంత పెద్ద న‌టుడైనా.. ఎంతో సింపుల్‌గా ఉంటాడ‌ని, చిత్ర యూనిట్‌లందరితో క‌లిసి మెల‌సి మాట్లాడుతారని అన్నారు. స్థాయిని చూసి గౌర‌వించే మ‌నిషి కాదు. తోటి మ‌నిషి ఎవ‌రైనా ఎలా ఉన్నా కూడా గౌర‌విస్తారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని వైష్ణ‌వ్ తేజ్ పేర్కొన్నారు. అలాగే Uppena ఉప్పెన షూటింగ్ చివ‌రిరోజున విజ‌య్ సేతుప‌తిగారు చేసిన ప‌నికి చిత్ర యూనిట్‌లో అంద‌రూ భావోద్వేగానికి లోన‌య్యారు. ఈUppena చిత్రానికి ప‌నిచేసిన కార్మికులంద‌రికీ.. ప్ర‌త్యేకంగా డిన్న‌ర్ ఇవ్వ‌డ‌మే కాకుండా.. ఒక్కొక్క‌రికి ప్ర‌త్యేకంగా వెయ్యి రూపాయ‌లు ఇచ్చారు. అంత‌టి గొప్ప మ‌నిషి విజ‌య్ సేతుప‌తి గారితో న‌ట‌న‌లో పాలు పంచుకోవ‌డం నా అదృష్టం అని వైష్ణ‌వ్ తేజ్ పేర్కొన్నాడు.