సోనూసూద్ హీరో.. విశాల్ విలన్

చాలామంది సౌత్ ఇండియా హీరోలు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా రాణిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు హీరో విశాల్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోయాడు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హీరోగా గుర్తింపు పొందాడు విశాల్. ఇప్పుడు బాలీవుడ్‌ సినిమాలో ఆఫర్ రావడంతో.. అక్కడ కూడా సత్తా చాటేందుకు విశాల్ రెడీ అయ్యాడు.

sonusood and vishal

అయితే హీరోగా కూడా విలన్‌గా బాలీవుడ్‌లోకి విశాల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. విశాల్ హీరోగా వచ్చిన అభిమన్యుడు సినిమాను హిందీలోకి రీమేక్ కానుందని తెలుస్తోంది. ఇందులో సోనూసూద్ హీరోగా నటించనుండగా.. విలన్‌గా విశాల్ నటిస్తాడని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. కాగా అభిమన్యుడు సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.