కొడుక్కే సవాల్ విసురుతున్న కోలీవుడ్ స్టార్ హీరో తండ్రి

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ చాలా ఫిట్ గా ఉంటాడు. మంచి హైట్ తో, సాలిడ్ ఫిజిక్ తో విశాల్ యాక్షన్ హీరోకి పర్ఫెక్ట్ డెఫినిషన్ లా ఉంటాడు. అలాంటి విశాల్ కే కాంపిటీషన్ ఇచ్చేలా ఎక్సర్సైజులు చేస్తున్నాడు అతని తండ్రి. రీసెంట్ గా కరోనాతో ఎఫెక్ట్ అయిన విశాల్ ఫాదర్ జీకే రెడ్డి, వైరస్ నుంచి పూర్తిగా కోలుకోని ఫాలోవర్స్ కి ఫిట్నెస్ గోల్స్ ఇస్తున్నాడు.

ప్రొడ్యూసర్ అయిన జీకే రెడ్డి, 82 ఏళలో కూడా చాలా ఫిట్ గా ఉంటూ, విశాల్ తో పోటీ పడేలా ఉన్నాడు. తన ఫిట్నెస్ మంత్రాన్ని చూపిస్తూ జీకే రెడ్డి ఒక వీడియో పోస్ట్ చేశాడు, అందులో ఆయన బేసిక్ ప్లాంక్, లెగ్ రైజ్, ఎలివేటడ్ ప్లాంక్, బేసిక్ స్క్వాట్, పారలెల్ స్క్వాట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్య పరిచాడు. కరోనా కారణంగా బయటికి వెళ్లే పరిస్థితి లేదని… ఇంట్లో ఉండి కూడా ఫిట్ నెస్ పెంపొందించుకోవచ్చని చెప్పిన జీకే రెడ్డి, తన ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ని కూడా పోస్ట్ చేస్తానని చెప్పారు.