హై ఓట్లేజ్ యాక్షన్ డ్రామా…

2017 నుంచి ఫ్లాప్ అనేదే తెలియని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, ఈ ఏడాది అయోగ్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకి రీమేక్ గా వచ్చిన అయోగ్య మూవీ విశాల్ కి మంచి పేరు కూడా తెచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతని నటనకి విమర్శకుల ప్రశంశలు దక్కాయి. అయోగ్య తర్వాత విశాల్ చేస్తున్న సినిమా యాక్షన్. సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కోలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విశాల్ స్పైగా నటిస్తున్న ఈ మూవీ పోస్టర్స్ ఇప్పటికే బయటికి వచ్చి, సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ సినిమాని గుర్తు చేస్తున్నాయి. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో రానున్న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.

యాక్షన్ సినిమాలో విశాల్, మిలిటరీ కమాండర్ సుభాష్ పాత్రలో కనిపించనున్నాడు. ట్రిడెంట్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సుందర్ సి, విశాల్ కాంబినేషన్ లో గతంలో ఒక సినిమా వచ్చింది కానీ అది కమర్షియల్ గా సక్సస్ కాలేదు. అయితే హీరోగా విశాల్ కి ఆ మూవీ మంచి ఓపెనింగ్స్ రాబట్టింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూ వస్తున్న యాక్షన్ సినిమా విశాల్, సుందర్ కి కావాల్సిన సక్సస్ ఇస్తుందేమో చూడాలి.