Visakhapatnam: విశాఖ ఉక్కు ఉద్య‌మం.. మంచు విష్ణును అడ్డుకున్న పోలీసులు

Visakhapatnam: విశాఖ ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగ‌సిప‌డుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్ర ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని మార్చుకున్నంత వ‌ర‌కు ఆందోళ‌న‌లు త‌గ్గ‌వ‌ని ప్ర‌క‌టించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగాయి. అయితే మోస‌గాళ్లు చిత్రానికి ప్ర‌మోష‌న్స్ భాగంగా వ‌చ్చిన మంచు విష్ణు.. ఈ Visakhapatnam విశాఖ ఉక్కు ప్రైవీటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా కొన‌సాగుతున్న ఉద్య‌మానికి నేరుగా మ‌ద్దతు తెల‌ప‌డానికి వ‌స్తున్న మంచు విష్ణును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మంచు వారి అభిమానులు, ఆందోళ‌న‌కారులు పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేశారు. ఇక ఇదిలా ఉంచితే..

మంచు విష్ణు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మోస‌గాళ్లు చిత్రం ఈ నెల 19న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ చిత్రంలో మంచు విష్ణుకు సోద‌రిగా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, న‌వ‌దీప్‌, న‌వీన్ చంద్ర త‌దితరులు న‌టించిన చిత్రానికి జెఫ్రీ గీ చిన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. కాగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా 10నిమిషాల ప్రీమియ‌ర్ షోను విశాఖ‌లోని మెలోడీ థియేట‌ర్లో ప్ర‌ద‌ర్శించేందుకు చిత్ర‌బృందం ఏర్పాట్లు చేసింది. ఈ క్ర‌మంలో Visakhapatnam విశాఖ ఎయిర్‌పోర్టుకు మంచు విష్ణు, న‌వ‌దీప్ విశాఖ‌లో సంద‌డి చేశారు.