Breaking: విరుష్క దంపతులకు ఆడబిడ్డ?

బాలీవుడ్ హీరోయిన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ ప్రస్తుతం గర్భవతిగా ఉన్న విషయం తెలిసిందే. త్వరలో అనుష్కశర్మ, విరాట్ కోహ్లీ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇటీవల అనుష్కశర్మను కోహ్లీ హాస్పిటల్‌కు తీసుకెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనుష్కశర్మకు అమ్మాయి పుడుతుందని ఒక జోతిష్యుడు చెప్పాడు.

virushka baby girl

ఇండియాలోనే ప్రముఖ జోతిష్యుడిగా పేరు పొందిన పండిట్ జగన్నాథ్ ఈ విషయాన్ని తెలిపాడు. విరుష్క దంపతుల ఫేస్ రీడింగ్, వారి జ్యోతిష్యం పరంగా చూస్తే.. అనుష్క అమ్మాయికి జన్మనిస్తుందని తెలుస్తోందని పండిట్ జగన్నాథ్ తెలిపారు. అనుష్క, విరాట్ కోహ్లీ ఇండియాలోనే పాపులర్ సెలబ్రెటీలు. దీంతో వారికి సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతూ ఉంటుంది. గత సంవత్సరం ఆగస్టులో అనుష్క గర్భవతి అయినట్లు అనుష్క, విరాట్ కలిసి ప్రకటించారు.