Rana Daggubati: రానా విరాట ప‌ర్వం టీజ‌ర్ రిలీజ్ చేసిన మెగాస్టార్‌..

Rana Daggubati: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా తెర‌కెక్కుతున్న చిత్రం విరాట ప‌ర్వం. వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతుండ‌గా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. ఈ మేర‌కు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విరాట‌ప‌ర్వం టీజర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రివ‌ల్యూష‌న్ ఈజ్ యాక్ట్ ఆఫ్ ల‌వ్ అనేది ట్యాగ్‌లైన్‌. ఈ చిత్ర టీజ‌ర్ ఎంతో అల‌రిస్తోంది. ఆధిప‌త్య జాడ‌ల‌నే చేరిపేయ‌గా ఎన్నినాళ్లు.. తార‌త‌మ్య గోడ‌ల‌నే పెకిలించ‌క ఎన్నినాళ్లు..దున్నేటోడి వెన్ను విరిచి భూస్వాములు ధ‌నికులైరి అంటూ రానాRana Daggubati చెప్పే డైలాగ్ ఎంతో అల‌రిస్తోంది.

Rana Movie Teaser

ఇక సాయిప‌ల్ల‌వి అయితే ఏకంగా పోలీసుల‌ను దొంగ లం.. కొడ‌కా అంటూ ఆగ్ర‌హాం వ్య‌క్తం చేసేది ఓ రేంజ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి భార‌త‌క్క పాత్ర‌లో న‌టిస్తుంది. అలాగే ఈ చిత్రంలో నివేథా పేతురాజ్‌, నందితాదాస్‌, న‌వీన్ చంద్ర‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్, సాయిచంద్, బెన‌ర్జీ, రాహుల్ రామ‌కృష్ణ‌, నాగినీడు త‌దిత‌రులు న‌టించారు. ఇక ఈ చిత్రాన్ని సురేశ్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్, శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్స్‌పై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. ఏప్రిల్ 30న ఈ Rana Daggubati చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు.‌