Rana Daggubati: ఉమెన్స్ డే సంద‌ర్భంగా విరాట ప‌ర్వం నుంచి ప్ర‌త్యేక వీడియో..

Rana Daggubati: రానా ద‌గ్గుబాటి, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తున్న విరాట‌ప‌ర్వం చిత్రం నుంచి ప్ర‌త్యేక వీడియోను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. నేడు మ‌హిళాల దినోత్స‌వం సంద‌ర్భంగా ఈ వీడియోను పంచుకున్నారు. అడ‌వి బాట ప‌ట్టిన అనేక మంది వీరుల త‌ల్లుల‌కు వీరు ప్ర‌తిరూపాలు అంటూ ఈ వీడియోను.. మ‌హా సంక్షోభమే ఓ గొప్ప శాంతికి దారి తీస్తుంద‌ని న‌మ్మిన విప్ల‌వం త‌న‌ది.. వారి మార్గం అసామాన్యం రెడ్ సెల్యూట్ అంటూ రానా వాయిస్ ఓవ‌ర్ ఇచ్చాడుRana Daggubati .

Virataparvam

ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.. ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రిస్తోంది ఈ తాజా ప్ర‌త్యేక వీడియో. ఈ వీడియోలో సాయిప‌ల్ల‌వి, నందితాదాస్‌, ప్రియ‌మ‌ణి, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్, నివేదా పేతురాజ్‌లు క‌నిపిస్తారు. ఇక ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో.. సురేశ్‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ ఎల్వీ సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఈ Rana Daggubati చిత్రం ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.