Virushka: డెలివ‌రీ త‌ర్వాత తొలిసారి బ‌య‌టికొచ్చిన విరాట్-అనుష్క‌!

Virushka: విరుష్క ఇటీవ‌లే పండంటి ఆడ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. జనవరి 11న ఒక ఆడపిల్లను ఈ ప్ర‌పంచంలోకి స్వాగతించారు విరుష్కా దంప‌తులు. కాగా డెలివ‌రీ అయిన త‌ర్వాత విరాట్-అనుష్క‌ దంపతులు మొద‌టిసారి బ‌య‌ట క‌నిపించారు. విరాట్ కోహ్లీ మొత్తం నల్లని దుస్తులను ధరించగా, అనుష్క శర్మ డెనిమ్ జీన్స్ ధ‌రించింది. అనుష్క మోడ్ర‌న్ డ్రెస్‌లో ట్రెండీగా ద‌ర్శ‌న‌మిచ్చింది. అనుష్క‌ త‌ల్లి కాక‌ముందు ఎలా ఉండేదో..

అలాంటి లుక్‌లోనే క‌నిపించింది. అయితే వీరి ముద్దుల పాప ఫోటోలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కూ సోష‌ల్‌మీడియాలో క‌నిపించ‌లేదు. త‌మ బిడ్డ‌ను సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు Virushka విరుష్కా దంప‌తులు తెలిపారు. ఇది కొద్దిగా క‌ష్ట‌మే అయినా.. పాటిస్తామ‌ని పేర్కొన్నారు. అయితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో వీరు క‌నిపించారు. హాస్పిట‌ల్‌కు వెళ్తుండ‌గా.. తీసిన ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.