Kollywood: తెర‌పై న‌టిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోబోతున్న వీర‌ప్ప‌న్ కూతురు..

Kollywood: వీర‌ప్ప‌న్ అంటే గంద‌పు చెక్క‌ల స్మ‌గ్ల‌ర్ అనే విష‌యం తెలిసిందే.. క‌ర్ణాట‌క‌, త‌మిళ‌నాడు ప్ర‌భుత్వాల‌ను ఎంతో ఇబ్బంది పెట్టాడు.. అయితే సుదీర్ఘ కాలం పాటు ఇబ్బందిపెట్టిన వీర‌ప్ప‌న్‌ను ఎన్‌కౌంట‌ర్ చేయ‌డం జ‌రిగింది. కాగా ఆయ‌న జీవిత‌చ‌రిత్ర‌పై ప‌లు భాష‌ల్లో చిత్రాల‌ను తెర‌కెక్కించారు. తాజాగా ఆయ‌న చిన్న కూతురు విజ‌య‌ల‌క్ష్మీ న‌టిగా మారి అదృష్టంను ప‌రీక్షించుకోబోతుంది.

Virappan Latest Movie

మావీర‌న్ పిళ్లై అనే త‌మిళ్ సినిమాతో న‌టిగా కోలీవుడ్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్ట‌నుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. దీంట్లో త‌న తండ్రి క‌థ‌నే లేడీ వెర్ష‌న్‌లో చూపించ‌బోతున్న‌ట్లు క‌‌నిపిస్తుంది. ఆమె సీరియ‌స్ లుక్‌తో ఆమె తండ్రి ఎలా అయితే గ‌న్‌ను భుజంపై పెట్టుకుని ఉంటాడో అలాగే ఉంది. ‌