వినాయక్ విక్టరీనే టార్గెట్ గా వస్తున్నాడు…

చిరు రీ ఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ 150 తో టూ ఇయర్స్ బ్యాక్ భారీ సక్సెస్ హిట్ కొట్టాడు వి.వి.వినాయక్ గత కొంతకాలంగా బ్యాడ్ టైములో ఉన్నాడు. వినాయక్ కి బాలయ్య అవకాశం ఇవ్వడంతో ఇక అంతా సెట్ అవుతుంది అనుకున్నారు. అది డిలే అవ్వడంతో వినాయక్ పరిస్థితి మొదటికి వచ్చింది, ఇలాంటి సమయంలో దిల్ రాజు వినాయక్ ని ఏకంగా హీరోని చేస్తూ సీనయ్య సినిమాని అనౌన్స్ చేశాడు. రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలయ్యింది. వినాయక్ హీరో అయినా కూడా దర్శకత్వం వదలనని చెప్తున్నాడు. బాలకృష్ణ, బోయపాటి సినిమాని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు. ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడంతో వినాయక్ నెక్స్ట్ ఏ హీరోతో చేస్తాడు అనే అనుమానం అందరిలోనూ ఉంది.

vinayak venkatesh

బాలయ్య కోసం పూర్తి కథని సిద్ధం చేసి, సెట్స్ పైకి తీసుకెళ్లాలి అనుకుంటున్న సమయంలో క్యాన్సిల్ అవ్వడంతో ఇప్పుడు వినాయక్, ఆ కథకి కావాల్సిన మార్పులు చేర్పులు చేస్తూ అదే స్టోరీని విక్టరీ వెంకటేష్ కి వినిపించే ప్రయత్నం చేశాడని, వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఇది అఫీషియల్ గా ఎంత వరకూ నిజమనేది తెలియదు కానీ వెంకీ మాత్రం ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు, టైంలో ఒక మంచి యాక్షన్ మూవీ పడితే వినాయక్ కెరీర్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కినట్లే. సీనయ్య సినిమా అయ్యాక ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.