సీనియర్ మాస్ దర్శకుల్లో ఒకరైన వివి.వినాయక్ హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సీనయ్య అనే సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్ లో నరసింహా రావ్ దర్శకత్వంలో మొదలైన ఆ సినిమా ఊహించని విధంగా క్యాన్సిల్ అయినట్లు వార్తలు అయితే వచ్చాయి. చిత్ర యూనిట్ ఆ విషయంపై వివరణ ఇవ్వకపోవడంతో ఆ తరువాత అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.
సినిమా మొదలు పెట్టిన తరువాత సెకండ్ ఆఫ్ విషయంలో నిర్మాత దిల్ రాజుతో పాటు వినాయక్ కూడా స్క్రిప్ట్ పై కాస్త అసంతృప్తిగా ఉండడంతో వెంటనే సినిమాను ఆపేయాల్సి వచ్చిందట. ఇక ఆ ప్రాజెక్ట్ అటకెక్కినట్లేనని అనుకుంటున్న తరుణంలో దర్శకుడు నరసింహా మరో వివరణ ఇచ్చినట్లు కొన్ని వెబ్ మీడియాలలో టాక్ వస్తోంది. ఎలాగైనా సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు కథలో కొన్ని మార్పులు చేస్తున్నాడట. త్వరలోనే మళ్ళీ సినిమాను స్టార్ట్ చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.