దర్శకుడు హీరో అయ్యేది ఆ రోజే

దర్శకుడిగా ఒకప్పుడు స్టార్ హీరోలతో వర్క్ చేసి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు వీవీ వినాయక్. కమర్షియల్ సినిమాలకి కెరాఫ్ అడ్రస్ గా నిలిచిన వినాయక్ ఇప్పుడు హీరోగా పరిచయం అవుతున్నాడు. దిల్ రాజు నిర్మించబోతున్న ఈ సినిమా కోసం వినాయక్ తన లుక్ అండ్ ఫిజిక్ పై వర్క్ చేస్తున్నాడు. భారీ బడ్జెట్లతో పాన్ ఇండియా చిత్రాల్ని తెరకెక్కించే స్టార్ డైరెక్టర్ శంకర్ శిష్యుడు ఎన్. నరసింహారావు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందన్న ప్రశ్నకి తాజాగా ఓ సమాధానం దొరికింది. అక్టోబర్ 9న దర్శకుడు వి.వి.వినాయక్ పుట్టినరోజు కావడంతో, అదే రోజున ఆయన హీరోగా పరిచయం కానున్న చిత్రం పూజా కార్యక్రమాలతో లాంచ్ కానుందట. పుట్టినరోజుకు తోడు విజయదశమి పండుగ కూడా అప్పుడే అవడంతో పండగ కూడా కలిసి వస్తుండటంతో ఆరోజు సినిమాని లాంచ్ చేస్తున్నారట. ఈ సినిమాలో ఇతర నటీనటులెవరు? టెక్నీషియన్స్ ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.