విక్ర‌మ్ “కోబ్రా” టీజ‌ర్ రిలీజ్‌.. స్పందించిన మాజీ క్రికెట‌ర్‌!‌

టీమ్ ఇండియా మాజీ క్రికెట‌ర్ ఇర్ఫాన్ పఠాన్, విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కుతున్న‌ కోబ్రా చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఇర్ఫాన్ త‌న‌కు న‌ట‌న అంటే ఇష్ట‌మ‌ని ప‌లు ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించ‌గా.. ఈ నేప‌థ్యంలోనే అజ‌య్ జ్ఞాన‌ముత్తు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న కోబ్రా చిత్రంలో న‌టించి కోలీవుడ్‌తో త‌న యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో చియాన్ విక్ర‌మ్ 20పైగా విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు.. ఈ సినిమాలోని కొన్ని కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించేందుకు చిత్ర‌యూనిట్ 2020 మార్చిలో ర‌ష్యాకు వెళ్లిన విష‌యం తెలిసిందే.. ఇక ఈ నేప‌థ్యంలోనే సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని శ‌నివారం విడుద‌ల చేసిన ఈ సినిమా టీజ‌ర్ అంచ‌నాల‌ను పెంచుతోంది. తాజాగా ఈ సినిమా టీజ‌ర్‌పై ఇర్ఫాన్ స్పందించారు. కోబ్రాలో ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు.

cricketer irfan patan

కోల్‌క‌తాలో షూటింగ్‌ సంద‌ర్భంగా తీసిన ఫోటోల‌ను అభిమానుల‌తో పంచుకుంటూ.. కోల్‌క‌తాలో ఇంట‌ర్‌పోల్ ఆఫీస‌ర్ ఏం చేస్తున్నారు? అని క్యాప్ష‌న్ ఇచ్చారు. అలాగే సిని ప‌రిశ్ర‌మ‌లో ప‌లు విజ‌యవంత‌మైన చిత్రాల్లో న‌టించి విక్ర‌మ్ స్టార్ అయ్యారు.. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న చాలా సింపుల్‌గా ఉంటారు. అదే ఆయ‌న‌లో నాకు న‌చ్చిన గుణం. షూటింగ్ సెట్స్‌లో ఆయ‌న్ను క‌లిసిన ప్ర‌తిసారీ స‌మ‌యం అలా గ‌డిచిపోతుండేది అని చెప్పుకోచ్చారు. విక్ర‌మ్ హీరోగా, ఇర్ఫాన్ ప‌ఠాన్ ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తోన్న చిత్రంలో డైరెక్ట‌ర్ కేఎస్ ర‌వికుమార్‌, శ్రీ‌నిధిశెట్టి, మృణాలిని, క‌నికా, ప‌ద్మ‌ప్రియ‌, బాబు ఆంటోనీలు త‌దిత‌రులు కీల‌క‌పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇటీవ‌లే మూవీ టీం ఓ పాట‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్ ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కురుస్తున్నారు.