Tollywood: A సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేసిన విజ‌య్‌సేతుప‌తి..

Tollywood: కోలీవుడ్ స్టార్ హీరో మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్‌సేతుప‌తి న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు.. ఆయ‌న ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి కోట్లాది అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. వైవిధ్య క‌థ‌ల‌ను ఎంచుకుంటూ.. మ‌రోవైపు కీల‌క‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ.. విల‌న్‌గా కూడా చేస్తు మ‌రింత గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవ‌లే తెర‌కెక్కిన త‌మిళ్ చిత్రం మాస్ట‌ర్‌, తెలుగు చిత్రం ఉప్పెన‌ల్లో విల‌న్ పాత్ర‌ను పోషించి సినీ ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకున్నాడు..

ఈ చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎంతో ఘ‌న‌విజ‌యం సాధించాయి.. కాగా తాజాగా ఒక చిన్న సినిమాకు(అంటే చిన్న సినిమా కాదు స్టార్స్ లేని సినిమా)కు స‌పోర్ట్ చేశాడు విజ‌య్ సేతుప‌తి. A నితిన్ ప్ర‌స‌న్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రానికి యుగంధ‌ర్ ముని ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అవంతిక ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై గీతా మిన్సాల సినిమాను నిర్మించారు. అయితే ఇటీవ‌లే ఈ సినిమా ట్రైల‌ర్‌ను రిలీజ్ చేసిన విజ‌య్‌సేతుప‌తిని తాజాగా ముంబైలో ఏ.. చిత్ర‌బృందం క‌లిసి త‌మ సినిమాకు స‌పోర్ట్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.. ఈ సంద‌ర్భంగా త‌ప్ప‌కుండా ఈ చిత్రం మంచి విజ‌యవంతం కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాన‌ని అన్నాడు విజ‌య్‌సేతుప‌తి.