బన్నీకి ‘రౌడీ’ గిఫ్ట్స్

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో విజయ్ దేవరకొండ ప్రత్యేకత వేరు. టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో యూత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నాడు. హీరోగా ఎంట్రీ ఇచ్చిన పెళ్లిచూపులు సినిమాతో విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ.. ఆ సినిమా తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఇక అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ జాతీయ స్థాయికి వెళ్లిపోయింది. ఈ సినిమాతో విజయ్ స్టార్‌డమ్‌ను అందుకున్నాడు.

ALLU ARJUN

ఆ తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తూ విజయ్ దేవరకొండ బిజీబిజీగా గడుపుతున్నాడు. గోత గోవిందం లాంటి సినిమాలతో ఇటు యూత్‌తో పాటు అటు ఫ్యామిలీ ఆడియోన్స్‌ని కూడా అలరించాడు. ప్రస్తుం పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఫైటర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఒకవైపు సినిమాలతో పాటు మరోవైపు బిజినెస్‌లో కూడా విజయ్ రాణిస్తున్నాడు.

రౌడీ కబ్ల్ పేరుతో ఒక కొత్త క్లాతింగ్ బ్రాండ్‌ని విజయ్ దేవరకొండ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ బ్రాండ్ ద్వారా యూత్‌కి కావాల్సిన స్ట్రైల్ ఎలివేషన్‌తో డ్రెస్‌లు అందిస్తున్నాడు. ఈ బ్రాండ్‌కు స్ట్రైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా పెద్ద ఫ్యాన్. రౌడీ బ్రాండ్ నుంచి ఏ కొత్త డ్రెస్ డిజైన్ మార్కెట్‌లోకి వచ్చినా అది బన్నీకి వెళుతుంది. తాజాగా రౌడీ బ్రాండ్ తయారుచేసిన న్యూ స్ట్రైల్ లాంగ్ స్లీవ్ టీషర్ట్ అండ్ ప్యాంట్‌ని బన్నీకి విజయ్ పంపించాడట. వీటిని ధరించి బన్నీ సోషల్ మీడియాలో ఒక ఫొటోను షేర్ చేశాడు. ఇవి ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.