Vijayashanthi: సోషల్ మీడియాకు కేంద్రప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంటర్నెట్ ఆధారిత, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కొత్త నియమావళిని కేంద్రం రిలీజ్ చేసింది. దీనికి సంబంధించిన నేడు కేంద్ర ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కొన్ని విషయాలను వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై విస్తృత స్థాయిలో చర్చించామని మంత్రి తెలిపాడు. డిజిటల్ కంటెంట్ లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్ లేదా సందేశం పోస్ట్ చేసిన వారి తొలి వ్యక్తి సమాచారాన్ని కోర్టు ఆదేశం లేదా ప్రభుత్వ ఆదేశం ప్రకారం సోషల్ మీడియా సంస్థలు బహిర్గతం చేయాలని మంత్రి రవిశంకర్ తెలిపారు. విదేశీ వ్యవహారాలు, అత్యాచారం, అసభ్య కంటెంట్‌ను ప్రచారం చేసేవారి విషయంలోనే ఈ చర్యలు వర్తిస్తాయని మంత్రి వెల్లడించారు. అలాగే మహిళల గౌరవానికి సంబంధించిన అంశంలో ఎటువంటి అసభ్యకరమైన ఫోటోలను వాడరాదు. ఆడవారిని తప్పుగా చిత్రీకరిస్తూ ఏవైనా ఫోటోలను అప్లోడ్ చేస్తే.. వారు ఫిర్యాదు చేసిన 24గంటల్లోనే ఆ ఫోటోలను, సందేశాలను తొలగించాలని మంత్రి తెలిపారు.

మహిళల పట్ల గౌరవం కారణంగా ఈ నియమాన్ని తీర్చిదిద్దినట్లు మంత్రి తెలిపారు. ఈ విషయంపై ప్రముఖ నటి, తెలంగాణ బీజేపీ లీడర్ Vijayashanthiవిజయశాంతి స్పందించింది. సరైన విధివిధానాలు లేకుండా ఉన్న ఓటీటీ, సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోవడం హర్షణీయం అని విజయశాంతి పేర్కొన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ పేరిట విద్వేషాల్ని రగిల్చే రాతలు, వీడియోలు ఎక్కువయ్యాయని.. ఇలాంటి రాతల వల్ల ఎన్నో కుటుంబాలు మనోవేదనకు గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారుVijayashanthi. ఓటీటీలు, సోషల్ మీడియాకు ఇప్పటివరకు నియంత్రణ లేకపోవడం వల్ల కొన్ని సందర్భాల్లో వ్యవస్థల ఉనికే ప్రమాదంలో పడిందని.. దేశ ఐక్యత సైతం ముప్పు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని ఆమె అన్నారు. గతంలో సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నాయన్న విషయాన్ని ప్రస్తావించానని విజయశాంతి వెల్లడించారు. ఈ విషయంపై కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకోవడం తాను స్వాగతిస్తున్నట్లు విజయశాంతిVijayashanthi పేర్కొంది.