
ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి తన తల్లి పాత్ర పోషిస్తూ ప్రజలకు ముందుకు రానున్న చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి రచనల దర్శకత్వంలో అజనీష్ లోకనాథ్ సంగీత దర్శకుడిగా ఈ చిత్రానికి పనిచేశారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ ఇంకా విజయశాంతికి మాట్లాడుతూ వారి మధ్య కొన్ని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. కళ్యాణ్ రామ్ తన చిన్న వయసులో ఉచిత షూటింగ్ కు వెళ్ళిన సందర్భంగా అదే చిత్రంలో నటిస్తున్న విజయశాంతి గారు తనను సొంత కొడుకులా చూసుకున్నారని తనకు దగ్గర ఉండి భోజనం వడ్డించినట్లు తెలిపారు. అంతేకాక తనకు ఇష్టమని చెప్పి ఐస్ క్రీమ్ ఇచ్చారని విజయశాంతి గారికి మరోసారి గుర్తు చేశారు. అలాగే ఈ చిత్రం కోసం ఆమె నాన్ వెజ్ మానేశారు అని తెలిపారు. ఈ చిత్రం మొదలైన రోజు నుండి చిత్రం విడుదలై విజయం సాధించేవరకు తను నాన్ వెజ్ తిననని మొక్కుకున్నట్లు తెలిపారు. చిత్రం విడుదలైన తర్వాత తానే చేపల కూర తీసుకుని వచ్చి విజయశాంతి గారికి ఇస్తానని కళ్యాణ్ రామ్ తెలియజేయగా విజయశాంతి ఆరోజు మనం గుర్తు వెళ్లి వస్తాం కాబట్టి తర్వాత ఎప్పుడైనా అని తెలిపారు. దానికి కళ్యాణ్ గా మనవికరిస్తూ మీరు ఎప్పుడంటే అప్పుడు అని సమాధానం ఇచ్చారు. స్టేజ్ పై విజయశాంతి గారిని అమ్మకు పిలుస్తూ తనను కూడా తన బిడ్డలాగా పిలవమని కోరారు.