విజయ్ కొత్త పార్టీపై ఎట్టకేలకు క్లారిటీ

కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో క్రేజ్‌ను సంపాదించుకున్నాడు హీరో విజయ్. తన సినిమాలతో ఎంతోమంది అభిమాలను సంపాదించుకున్నాడు. విజయ్‌ను అభిమానులు తలపతిగా పిలుచుకుంటారు. తలపతి అంటే కమాండర్ అని అర్థం. కోలీవుడ్‌లో అత్యధిక రెమ్యూనరేషన్ అందుకునేది విజయ్‌నే. ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రెటీల జాబితాలో ఇప్పటివరకు విజయ్ ఏడుసార్లు స్థానం సంపాదించుకున్నాడు.

vijay political party

అయితే విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఏదైనా పార్టీ నుంచి లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారనే వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. విజయ్ కొత్త పార్టీ పెట్టనున్నాడట. ‘పీపుల్స్ మూమెంట్ పార్టీ’ పేరుతో విజయ్ కొత్త పార్టీ స్థాపించబోతున్నాడని, ఇప్పటికే ఈ పేరును ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేయించారని తెలుస్తోంది.

డిసెంబర్ 31న విజయ్ తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించడంతో.. విజయ్ కాస్త వెనక్కి తగ్గాడు. కానీ ఆరోగ్య పరిస్థితుల వల్ల రాజకీయాల్లోకి అడుగుపెట్టకూడదని నిర్ణయించుకున్నట్లు తాజా రజనీ ప్రకటన చేయడంతో విజయ్ కొత్త పార్టీపై ముందడుగు వేసినట్లు సమాచారం.