పుష్పకు షాచ్చిన స్టార్ హీరో

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప’ సినిమా నుంచి తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో ఆయన స్థానంలో విక్రమ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ తప్పుకోవడంతో ఉపేంద్ర, సుదీప్, ఆర్య వంటి నటుల పేర్లను సినిమా యూనిట్ పరిశీలించింది. కానీ చివరికి విక్రమ్‌ని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో తెలుగులో విక్రమ్ రేంజ్ పెరగడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి.

pushpa

విక్రమ్ నటిస్తే ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెరగడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే పలు హీరోల సినిమాల్లో ప్రధాన పాత్రలలో విక్రమ్ నటించి అలరించాడు. అయితే ఈ వార్తలపై సినిమా యూనిట్ స్పందించాల్సి ఉంది. డేట్స్ క్లాష్ అవ్వడం వల్లనే విజయ్ సేతుపతి పుష్ప సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

బన్నీ-సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాలో రష్మీక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లాక్‌డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం శరవేగంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా.. వచ్చే ఏడాదిలో సినిమాను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యాయి.