వెబ్‌సిరీస్‌లోకి ఇద్దరు స్టార్ హీరోలు

ప్రస్తుత కరోనా కాలంలో థియేటర్లలోకి వెళ్లి సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు. దీంతో చాలా సినిమాలు ఓటీటీలోనే విడుదల అవుతున్నాయి. స్టార్ హీరోలు, హీరోయిన్ల సినిమాలు కూడా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఓటీటీలో వెబ్‌సిరీస్‌లకు ఎక్కువగా క్రేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలామంది పెద్ద పెద్ద హీరోలు, హీరోయిన్లు కూడా వెబ్‌సిరీస్‌లలో నటిస్తున్నారు. తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో, ఒక కోలీవుడ్ స్టారో హీరో కలిసి ఒక వెబ్‌సిరీస్‌లో నటించేందుకు సిద్ధమయ్యారు.

VIJAY SETUPATI

బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కలిసి ఒక వెబ్‌సిరీస్‌లో నటించనున్నారట. అమెజాన్ ప్రైమ్ ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మిస్తుండగా.. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించనున్నాడు. ఇందులో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలలో నటించనున్నాడు. జనవరిలో ముంబై,గోవాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం, షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు.

షాహిద్ కపూర్, విజయ్ సేతుపతికి ఇదే తొలి వెబ్‌సిరీస్. రెండు ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు కలిసి సటిస్తుండటంతో.. ఈ వెబ్ సిరీస్‌పై ఆసక్తి నెలకొంది. వెబ్‌సిరీస్‌లను చూసేందుకు ప్రస్తుతం ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపుతున్నారు. మరి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా?… లేదా? అనేది చూడాలి.