షాహిద్ కపూర్ సిరీస్ లో సేతుపతి స్పెషల్ రోల్

తెలుగు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే దర్శకులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీని సాధించారో అందరికీ తెలిసిందే. స్త్రీ, రూహి, ఫ్యామిలీ మ్యాన్, ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లతో ఆల్ ఓవర్ ది వరల్డ్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ఇద్దరూ మరో కొత్త సిరీస్ చేయడానికి రెడీ అయ్యారు. ఫ్యామిలీ మ్యాన్ ౩ స్క్రిప్ట్ వర్క్ అయ్యే లోపు ఈ కొత్త ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తున్న రాజ్ అండ్ డీకే, ఇప్పటికే షాహిద్ కపూర్-రాశి ఖాన్న లతో షూటింగ్ కూడా మొదలుపెట్టారు.

హై రేంజ్ థ్రిల్లర్ సిరీస్ గా రూపొందించబోతున్న ఈ ప్రాజెక్ట్ లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. నిజానికి సేతుపతి ఫ్యామిలీ మ్యాన్ ౩లో నటిస్తున్నాడు అనే వార్త బయటకి వచ్చి చాలా రోజులే అయ్యింది. అయితే విజయ్ సేతుపతి నటిస్తుంది ఫ్యామిలీ మ్యాన్ 3 లో కాదు, షాహిద్ కపూర్ సిరీస్ లో అని ఇటివలే క్లారిటీ వచ్చేసింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఈ కొత్త వెబ్ సిరీస్ టీం ఎంతటి సంచలనాన్ని సృస్టించనుందో చూడాలి.