విజయ్ సేతుపతి సినిమా కష్టాలు రేపటికైనా తీరుతాయా?

vijay setupathi

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంఘ తమిళ. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈరోజు కావాల్సింది కానీ అనివార్య కారణాల వళ్ల, ముఖ్యంగా ఫైనాన్సియల్ కారణాల వల్ల వాయిదా పడింది. తెలుగులో కూడా విజయ్ సేతుపతిగా రిలీజ్ అవుతున్న ఈ మూవీ దీపావళికే ప్రేక్షకుల ముందుకి రావాల్సి ఉంది కానీ అప్పుడు ఖైదీ, బిగిల్ సినిమాలు ఉండడంతో వాయిదా పడింది. సరే ఇప్పుడైనా రిలీజ్ అవుతుందనుకుంటే సేతుపతి అభిమానులని నిరాశపరిచింది. ఈరోజు నైట్ లోపు కానీ రేపు మార్నింగ్ కానీ షోస్ పడే అవకాశలు ఉన్నాయి అంటున్నారు. మరి నైట్ విషయం పక్కన పెడితే రేపు ఉదయానికైనా విజయ్ సేతుపతి షోస్ పడతాయా? లేక ఇంకా డిలే అవుతుందా అనేది చూడాలి.