Prabhas Salaar :ప్రభాస్ ‘సలార్‌’లో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో?

ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సలార్ సినిమా ఇటీవలే ప్రారంభమైంది. వచ్చే నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. నటీనటులను ఎంపిక చేసే పనిలో మేకర్స్ బిజీబిజీగా ఉన్నారు. ఈ క్రమంలో సలార్ సినిమాకు సంబంధించి ఒక వార్త ఆసక్తికరంగా మారింది.

VIJAY SETUPATHI VILLEN SALAAR

ఇందులో కోలీవుడ్ స్టార్ హీరే విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల విడుదలైన మాస్టర్ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. క్రూరమైన విలన్‌ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో విలన్ పాత్రలో విజయ్ సేతుపతికి మంచి మార్కులు పడ్డాయి. దీంతో సలార్‌లో విజయ్ సేతుపతిని విలన్‌గా తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.