విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల క‌ల‌యిక‌లో “ఓ మంచి రోజు చూసి చెప్తా” మార్చ్ 19న రిలీజ్‌..

విజయ్ సేతుపతి, నిహారిక కొణిదెల జంటగా ఆరుముగా కుమార్ దర్శకత్వంలో విడుదలై విజయవంతం అయినా తమిళ చిత్రం “ఓరు నల్ల నాల్ పాతు సోలరెన్”. మరి ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు. శ్రీమతి రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకం పై డాక్టర్ రావూరి వెంకటస్వామి ఈ చిత్రం తెలుగు హాక్కులను భారీ ధరకి సొంతం చేసుకున్నారు. ఈ చిత్రానికి “ఓ మంచి రోజు చూసి చెప్తా” అనే పేరుతో మార్చ్ 19న విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ రావూరి వెంకటస్వామి మాట్లాడుతూ.. “ఓ మంచి రోజు చూసి చెప్తా” చిత్రం తమిళం లో మంచి విజయం సాధించింది. విజయ్ సేతుపతి గారి నటన ఈ చిత్రానికే ఒక హైలైట్. విలక్షణ నటనతో ప్రేక్షకులని అలరిస్తాడు. నిహారిక కొణిదెల గారు ఎప్పుడు చేయని పాత్రలో కనిపిస్తారు. ఇది ఒక మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రాన్ని మార్చ్ 19 న భారీగా విడుదల చేస్తున్నామ అని తెలిపారు. ఇక ఈ చిత్రాన్ని అపోలో ప్రొడ‌క్ష‌న్స్ .. జ‌స్టీన్ ప్ర‌భాక‌ర‌న్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.