పంజా వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన` చిత్రీకరణలో పాల్గొంటున్న విజయ్ సేతుపతి..

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `ఉప్పెన`. వైష్ణవ్ తేజ్ సరసన క్రితి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లో బుధవారం నుండి తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి  పాల్గొంటున్నారు. సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసిన బుచ్చిబాబు సానా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సారథి స్టూడియోలో ఆర్ట్ డైరెక్టర్స్ మోనిక, రామకృష్ణ వేసిన భారీ సెట్‌లో ప్రస్తుతం సినిమా చిత్రీకరణను జరపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో వైష్ణవ్ తేజ్, రాజీవ్ కనకాల,  హీరోయిన్ క్రితి శెట్టి, అలాగే 500 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్, పతాకాలపై ఈ సినిమా నిర్మితమవుతోంది. 

న‌టీన‌టులు:
పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి, రాజీవ్ కనకాల త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బుచ్చిబాబు సానా
సి.ఇ.ఒ:  చెర్రీ
బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్ర‌ఫీ:శాంద‌త్ సైనుద్దీన్‌
సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌
ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి
ఆర్ట్‌:  మోనిక రామ‌కృష్ణ‌