విజయ్ సేతుపతి – సూరి ‘విడుతలై’ చిత్రం లోని ఉత్కంఠభరిత సన్నివేశాలు కొడైకెనాల్ లో చిత్రీకరణ!!

ప్రఖ్యాత తమిళ దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి – సూరి నటిస్తున్న చిత్రం “విడుతలై”. ఆర్.ఏస్ ఇన్ఫో్టైన్మెంట్ మరియు రెడ్ జియంట్ మూవీస్ పతాకం పై ఎల్డ్రడ్ కుమార్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో రెండు భాగాలుగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ చిత్రంలోని ఉత్కంఠభరిత సన్నివేశాలు కొడైకెనాల్ లోని పూంబరై లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, సూరి ఇతర ఫైటర్స్ కనిపించనుండగా పీటర్ హెయిన్ భారీ స్థాయిలో యాక్షన్ కోరియోగ్రఫీ చేస్తున్నారు. బల్గెరియా నుండి వచ్చిన కెమెరా సిబ్బంది దీన్ని ఉన్నత స్థాయిలో చిత్రీకరించనున్నారు.

తమిళ పరిశ్రమలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా తెరకెక్కుతున్న ‘విడుతలై’ చిత్రం పై ఆరంభం నుండే అంచనాలు ఉన్నాయి. ప్రముఖ నటులు, ప్రఖ్యాత నిర్మాణ సంస్థలు ఇందులో భాగమవ్వటం తో పాటు ఫస్ట్ లుక్ కి అనూహ్య స్పందన రావడంతో ఈ చిత్రం పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

విజయ్ సేతుపతి, సూరి తో పాటు భవాని శ్రీ, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ మరియు ఇతర అగ్ర తారలు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. సంగీతం మేస్ట్రో ఇసైజ్ఞాని ఇళయరాజా గారు ఇస్తుండగా సినిమాటోగ్రఫీ వేల్ రాజ్ చూస్కుంటున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన పాటలు, ట్రైలర్ మరియు ప్రపంచ వ్యాప్త విడుదల తేదీని నిర్మాతలు త్వరలోనే ప్రకటించనున్నారు.