శ్రీలంకన్ క్రికెటర్ బయోపిక్ లో సౌత్ హీరో ఫిక్స్

ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో అనేక రకాల బయోపిక్స్ వెండితెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే మరో క్రికెటర్ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అత్యధిక వికెట్లను అందుకొని ప్రపంచంలో ది బెస్ట్ బౌలర్స్ లలో ఒకప్పుడు చరిత్ర సృష్టించిన ముత్తయ్య మురళీధరన్ జీవితం వెనుక ఉన్న కష్టం గురించి ప్రపంచానికి పెద్దగా తెలియదు.

అయితే ఆ విషయాల్నిటిని త్వరలోనే వెండితెరపై చూపించబోతున్నారు. లెజండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ పాత్రలో విజయ్ సేతుపతి నటించబోతున్నాడు. శ్రీపతి దర్శకత్వం వహించనున్న ఈ బయోపిక్ త్వరలోనే సెట్స్ పైకి రానుంది. సినిమాకి సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. ఈ సినిమా తెలుగులో కూడా విడుదల కానుంది. మూవీని ట్రైన్ మోషన్ పిక్చర్స్ మరియు దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించనుంది.