విజ‌య్ సేతుప‌తి మూకీ సినిమా.. ఆ హీరో త‌ర్వాత ప్ర‌యోగం చేస్తున్నాడు..

మూకీ చిత్రాలకు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్రాధాన్యం త‌క్కువే.. టాకీలు రాక‌ముందే మూకీలు తీశారు కానీ.. ఆ త‌ర్వాత మూవీస్ పెద్ద‌గా తీసింది లేదు. గ‌తంలో క‌మ‌ల్‌హాస‌న్ హీరోగా తెరకెక్కిన పుష్ప‌క విమానం సినిమాలో ఆయ‌న మూకీ పాత్ర‌ను పోషించారు. ఈ సినిమాకు ప్ర‌యోగం చేసిన‌ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సింగితం శ్రీ‌నివాస‌రావు.. క‌మ‌ల్‌హాస‌న్ క‌లిసి ఆ అద్భుత చిత్రం తెర‌కెక్కి ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంది. అప్పుడు సెన్సెష‌న‌ల్ క్రియేట్ చేసింది. మ‌ళ్లీ ఆ స్థాయి మూకీ సినిమా మ‌రొక‌టి రాలేదు.

vijaysethupathi new film

తాజాగా మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి ఈ ప్ర‌యోగం చేయనున్నారు. విజ‌య్ సేతుప‌తి హీరోగా సినిమాలు చేస్తూనే.. మ‌రోప‌క్క విల‌న్‌గా మెప్పిస్తూ.. ఏ పాత్ర చేసినా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో మాట‌లు లేకుండా మూకీ సినిమా తెరకెక్కించ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు విజ‌య్ సేతుప‌తి. కిషోర్ పాండురంగ్ బేలెక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ మూకీ సినిమా రూపొందుతుంది. గాంధీ టాక్స్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. బ్యాగ్రౌండ్ మొత్తం క‌ర‌న్సీ నోట్ల‌తో నింపేయ‌డాన్ని ఈ ఫ‌స్ట్‌లుక్‌ ఫోటోలో క‌నిపిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా రూపొందుతుంది.. ఇదిలా ఉంటే.. ఇప్ప‌టివ‌ర‌కు క‌మ‌ల్‌హాస‌న్ త‌ర్వాత‌ ఏ స్టార్ హీరోలు మూకీల జోలికే వెళ్ల‌లేదు.. ప్ర‌స్తుతం విజ‌య్ ఆ రిస్క్ తీసుకుంటున్నాడు.. మ‌రి విజ‌య్ సేతుప‌తి మూకీ సినిమాతో ఎలా ఆక‌ట్టుకుంటాడో తెర‌పై చూడాల్సిందే.‌