టార్గెట్ రాజాగా రాబోతున్న విజయ్

కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి 65వ సినిమా కన్ఫామ్ అయిపోయింది. నిల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను సన్ పిశ్చర్స్ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సన్ పిశ్చర్స్ స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఒక పోస్ట్ పెట్టింది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించనుండగా.. విజయ్ కార్తీక్ కన్నం సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

vijay

అయితే ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం టార్గెట్ రాజా పేరును ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం విజయ్ నటించిన మాస్టర్ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ యూట్యూబ్‌లో రికార్డు సృష్టించగా.. త్వరలో ట్రైలర్ విడుదలయ్యే అవకాశముంది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా.. లాక్‌డౌన్ వల్ల థియేటర్లు మూతపడటంతో ఆలస్యమైంది.

వచ్చే సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో విడుదల అయ్యే అవకాశముంది. ఈ సినిమా కోసం విజయ్ అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఇందులో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు.