తెలుగులోనే మాస్టర్ హవా.. కలెక్షన్లు ఎంతో తెలుసా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతికి తమిళంలోనే కాదు.. తెలుగులోనూ ఎంతో క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా విజయ్‌కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగులోకి కూడా విజయ్ సినిమాలు డబ్ అవుతూ ఉంటాయి. ఇటీవల సంక్రాంతి సందర్భంగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన మాస్టర్ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.250 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించగా.. తెలుగులో కూడా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధించింది.

vijay amster telugu collections

తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిని బట్టి చూస్తే తెలుగులోనూ విజయ్‌కి బాగా క్రేజ్ ఉన్నట్లు అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం మాస్టర్ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.