రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ “లైగ‌ర్”‌.. దీనికి అర్థం!

రౌడీ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌, పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఫైట‌ర్ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ సినిమా టైటిల్‌తో పాటు.. ఫ‌స్ట్‌లుక్ ఉద‌యం 10గంట‌ల‌కు రిలీజ్ చేశారు చిత్ర‌బృందం. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కుతున్న సినిమాకు లైగ‌ర్ అని పేరు పెట్టారు. దీనికి సాలా క్రాస్ బ్రీడ్ అని ఉప శీర్షిక పెట్టారు. అయితే.. అస‌లు లైగ‌ర్ అంటే ఏంటీ.. మగ సింహం, ఆడ పులికి పుట్టే సంతాన‌ముని లైగ‌ర్ కు అర్థం.

ఇవి మామూలు సింహం, పులిక‌న్నా పెద్ద‌గా ఉండ‌డంతో పాటు సింహాల్లా గ‌ర్జిస్తాయి. ఇదిలా ఉంటే.. విజ‌య్ దేవ‌ర‌కొండ ఈ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో మార్ష‌ల్ ఆర్ట్స్‌పై ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక పూరీ జ‌గ‌న్నాద్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాత క‌ర‌ణ్ జోహార్‌, ఛార్మిలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న అన‌న్య పాండే.. టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యం కానున్న ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతుంది.