విజయ్-పూరీ సినిమా బడ్జెట్ ఎంతో తెలుసా?

యంగ్ హీరో విజయ్ దేవరకొండ-డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో లైగర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ పోస్టర్‌కు అభిమానులు బీర్లతో అభిషేకం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సినీ సెలబ్రెటీలు కూడా ఈ పోస్టర్‌పై ప్రశంసలు కురిపించారు.

vijay liger budget

పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కిస్తుండటంతో.. బడ్జెట్ కూడా చాలా అవుతుందని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ రూ.125 కోట్లు అవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో విజయ్ ఫైటర్ పాత్రలో నటిస్తుండగా.. పూరీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్లపై సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కూడా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు.