ఫ్రెండ్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిన హీరో విజయ్

తమిళ స్టార్ హీరో విజయ్ అంటే తెలియని వారుండరు. తమిళంలో టాప్ హీరోగా ఉన్న ఆయనకు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తెలుగులోకి కూడా విజయ్‌కి సంబంధించిన చాలా డబ్బింగ్ సినిమాలు విజయం సాధించాయి. ప్రస్తుతం మాస్టర్ సినిమా షూటింగ్‌లో విజయ్ బిజీగా ఉన్నాడు. త్వరలో మాస్టర్ సినిమా విడుదల కానుంది.

అయితే షూటింగ్‌ సమయంలో విజయ్ చాలా సైలెంట్‌గా ఉంటాడని, ఎవరితోనూ ఎక్కువ మాట్లాడడని ఆయనతో కలిసి నటించినవారు చెబుతారు. కానీ విజయ్ ఫ్రెండ్స్‌కి అతడి గురించి బాగా తెలుసు. విజయ్‌కి తమిళ నటుడు సంజీవ్ మంచి ఫ్రెండ్. వీరిద్దరు కలిసి చాలా సినిమాల్లో నటించారు. వీరిద్దరు కలిసి ఒకే కాలేజీలో చదువుకున్నారు. విజయ్ మంచి ఫ్రెండ్ అయినా సినిమా అవకాశాలు ఇప్పించాలని సంజీవ్ ఎప్పుడూ అడగలేదు.

వీరిద్దరు కలిసినప్పుడు కూడా సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకోరు. వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. సంజీవ్ ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా.. విజయ్ గురించి ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు. అయితే తాజాగా విజయ్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన ఒక చొక్కాను ధరించి సంజీవ్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ ఇచ్చిన ఈ గిఫ్ట్‌ను తాను ఎప్పుడూ మరిచిపోలేనని సంజీవ్ చెబుతున్నాడు.