విజయ్ న్యూ లుక్ వెనక డాషింగ్ డైరెక్టర్

యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తన లేటెస్ట్ లుక్ తో ఇంటర్నెట్ లో సందడి చేస్తున్నాడు.తన ఫ్యాషన్ బ్రాండ్ ‘‘రౌడీ వేర్’’ కోసం చేసిన ఫొటోషూట్ స్టిల్స్ వావ్ అనిపించేలా ఉన్నాయి.

తన యాట్యిటూడ్ తో యూత్ లో బలమైన ముద్రను వేసిన విజయదేవరకొండ ఫ్యాషన్ ప్రపంచానికి రౌడీ బ్రాండ్ తో స్టైయిల్ స్టెట్మెంట్ గా మారాడు. ప్రత్యేకత, నాణ్యత, భారతీయతను మేళవించి రౌడీ బ్రాండ్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసింది. ఒక సెలబ్రిటీ ఇమేజ్ తో నడుస్తున్న తొలి బ్రాండ్ ఇదే కావడం విశేషం. తన స్టైయిల్ స్టెట్ మెంట్స్ తో తన ప్యాషన్ అభిరుచితో రౌడీ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది.

ఇప్పుడు రౌడీ బ్రాండ్ ఫుట్ వేర్ ప్రొడక్ట్స్ లోకి కూడా తన మార్క్ ని చూపబోతుంది. త్వరలోని విస్తరించబోతున్న ‘స్ట్రీట్ వేర్’ బ్రాండ్ ఫుట్ వేర్ రంగంలో కొత్త వాయిస్ గా మారబోతుంది. ఈ రౌడీ వేర్ విషయం కాసేపు పక్కన పెడితే, విజయ్ ఈ కొత్త మేక్ ఓవర్ కి కారణం పూరి జగన్నాధ్ అని తెలుస్తోంది. హీరోని కొత్తగా చూపించడంలో దిట్ట అయిన పూరి, విజయ్ ని ఫైటర్ గా చూపించబోతున్నాడు. ఈ ఫైటర్ సినిమా కోసమే విజయ్ దేవరకొండ లుక్ మార్చినట్లు తెలుస్తోంది.