రౌడీ హీరో విజయ్ దేవరకొండ అప్పుడే అంత సంపాదించాడా?

యంగ్ హీరోల్లో టాప్ పొజిషన్ లో ఉన్న విజయ్ దేవరకొండ, బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే క్రాంతి మాధవ్ తెరకెక్కించిన వరల్డ్ ఫేమస్ లవర్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి రెడీ అయిన విజయ్, నెక్స్ట్ సినిమాని కూడా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నలుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న విజయ్, వరల్డ్ ఫేమస్ లవర్ ని ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకి తీసుకురావడానికి రెడీ అయ్యాడు.

వరల్డ్ ఫేమస్ లవర్ అయ్యాక, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక మూవీ చేయనున్నాడు. అఫీషయల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ టైటిల్ ఫైటర్ అనుకుంటున్నారని సమాచారం. తన కెరీర్ తో పాటు… తమ్ముడి కెరీర్ కూడా సెట్ చేసిన విజయ్, ఇప్పుడు ఒక ఇంటి వాడయ్యాడు. ఇంటి వాడయ్యాడు అంటే పెళ్లి చేసుకున్నాడు అనుకోకండి. విజయ్ ఓ ఇంటిని కొనుకున్నాడ‌ట‌. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో హీరో శ్రీకాంత్ ఇంటి స‌మీపంలో నిర్మించిన ఓ ఇంటిని విజ‌య్ దేవ‌ర‌కొండ కొనుక్కున్నాడు.

ఆదివారం దేవరకొండ ఫ్యామిలీ గృహ ప్ర‌వేశ కార్యక్రమం కూడా ముగిసింది. అరడజను సినిమాలు మాత్రమే చేసి ఫిల్మ్ నగర్ లో ఇళ్లు కొన్నాడు అంటే విజయ్ దేవరకొండ బాగానే సంపాదిస్తున్నట్లున్నాడని కొంతమంది అనుకుంటున్నారు. డిమాండ్ ఉంది కాబట్టి ఆ మాత్రం సంపాదిస్తే తప్పేంటి అని మరికొందరు అనుకుంటున్నారు. ఏది ఏమైనా విజయ్ మాత్రం అటు సినిమాలు, ఇటు రౌడీ వెర్ బ్రాండ్ తో డబ్బులు వచ్చే పనులు చేస్తున్నాడు.