Vijaydevarakonda: రౌడీ “లైగ‌ర్” రిలీజ్ డేట్ ఫిక్స్‌..

Vijaydevarakonda: రౌడీ విజ‌య్‌దేవ‌ర‌కొండ.. అర్జున్‌రెడ్డి చిత్రంతో ప్రేక్ష‌కుల్లో ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర్వాత విజ‌య్ ప‌లు చిత్రాల్లో న‌టించి త‌న మార్క్‌ను చూపించాడు. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు తాజాగా ఆయ‌న న‌టిస్తున్న చిత్రం లైగ‌ర్‌. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ Vijaydevarakonda ఈ చిత్రానికి డైరెక్ష‌న్ చేస్తుండ‌గా.. సినీ ప్రేక్ష‌కుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్టు ప్ర‌క‌టించారు చిత్ర‌బృందం.

liger release date

ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు చిత్ర‌బృందం. లైగ‌ర్ (సాలా క్రాస్ బ్రీడ్‌) చిత్రం సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్లోకి రానుంది. రిలీజ్ డేట్‌తో Vijaydevarakonda విజ‌య్ పోస్ట‌ర్‌ను చిత్ర‌బృందం రిలీజ్ చేశారు. త‌న హీరోల్ని స్టైలిష్‌గా ఆవిష్క‌రించే మాస్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్.. ఈ చిత్రంలో రౌడీ విజ‌య్‌ను ఓ రేంజ్‌లో చూపించ‌బోతున్న‌ట్లు ఈ పోస్ట‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది. ఇక ఈ చిత్రంలో Vijaydevarakonda విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య‌పాండే హీరోయిన్‌గా చేస్తోంది.. ఈ చిత్రాన్ని పూరి క‌నెక్ట్స్‌, బాలీవుడ్ ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాధ్‌, ఛార్మి. క‌ర‌ణ్ జోహార్‌, అపూర్వ మెహ‌తా సంయుక్తం నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్ర‌ల్లో ర‌మ్య‌కృష్ణ న‌టిస్తోంది.