మరో కొత్త బిజినెస్ మొదలుపెట్టిన స్టార్ హీరో

హీరో విజయ్ దేవరకొండ కొన్ని సంవత్సరాల క్రితం తన దుస్తుల లైన్ రౌడీ వేర్ తో బిజినెస్ మెన్ గా మారారు. తరువాత అతను సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కింగ్ ఆఫ్ ది హిల్ ను ప్రారంభించి నిర్మాతగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇక ఇప్పుడు, విజయ్ హైదరాబాద్‌కు చెందిన వాట్స్ & వోల్ట్స్ అనే ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌లో పెట్టుబడులు పెట్టాడు.

వాట్స్ & వోల్ట్స్ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్‌లు మరియు స్కూటీల ద్వారా ఎకో ఫ్రెండ్లీ ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణ కోసం తయారు చేసిన ఈ బైక్ ల వలన తక్కువ సమయంలో గమ్యాలకు చేరడమే కాకుండా అతి తక్కువ ధరలోనే ప్రయాణించవచ్చు . వాట్స్ & వోల్ట్స్ విజయ్ మదురి, వంశీ కరుమాంచి నిర్వహిస్తుండగా విజయ్ వారితో కలిసి ఈ సంస్థను లాంచ్ చేశాడు. ఇక ఈ హీరో ప్రస్తుతం ఫైటర్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల సుకుమార్‌తో కూడా ఒక కొత్త సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు.